- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ హోటల్ రూమ్.. బయటకు వచ్చిన సీక్రెట్ వీడియో?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్

దిశ, వెబ్ డెస్క్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి (Virat Kohli ) సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విరాట్ కోహ్లీ ఉన్న హోటల్ గదికి ( Hotel room) సంబంధించిన ప్రైవేట్ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో... విరాట్ కోహ్లీ పర్సనల్ గా వాడే వస్తువులతో పాటు క్రికెట్ బ్యాట్లు, జెర్సీలు (Jerssy) , ఇతర వస్తువులు కనిపించాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025 ) భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగాడు విరాట్ కోహ్లీ.
ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా... బెంగళూరు మాత్రం వరుసగా రెండు మ్యాచ్ లు విజయం సాధించింది. గతంలో కంటే మెరుగ్గా రాణిస్తోంది బెంగళూరు. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా.. బెంగళూరులోని ఓ హోటల్ లో RCB టీం స్టే చేస్తోంది. అయితే విరాట్ కోహ్లీ కి కూడా ప్రత్యేక గది కేటాయించారు. ఈ తరుణంలోనే విరాట్ కోహ్లీ కి సంబంధించిన గది వీడియో బయటకు వచ్చింది. విరాట్ కోహ్లీ ఏ వస్తువులు వాడతాడు... అతని రూమ్ లో ఇలాంటి వస్తువులు ఉంటాయి అనే విషయాలను బయటపెడుతూ ఈ వీడియోని వైరల్ చేశారు.
అయితే ఈ వీడియో విరాట్ కోహ్లీ కి తెలిసి బయటకు వచ్చిందా ? లేక ఎవరైనా రహస్యంగా షూట్ చేసి బయటకు వదిలారు అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వీడియోలో మాత్రం.. విరాట్ కోహ్లీ వాడే షూస్, జెర్సీలు, స్పెట్స్, దేవుడు విగ్రహాలు, క్రికెట్ కిట్టు రకరకాల వస్తువులు కనిపించాయి. అయితే ఈ వీడియోని చూసిన కొంత మంది మాత్రం... విరాట్ కోహ్లీ కి (Kohli ) సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారని.. పర్సనల్ విషయాలు బయటపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






