డకౌట్‌లలో సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ

by Disha Web Desk 12 |
డకౌట్‌లలో సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా ఆదివారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ 0 పరుగులకే డకౌట్ గా వెనుదిరిగాడు. కాగా ఈ మ్యాచ్ లో భారత ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగిన కోహ్లీ.. సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యధిక డకౌట్లు అయిన భారత బ్యాటర్ల జాబితాలోని సచిన్ ను కోహ్లీ సమం చేశాడు. కాగా కోహ్లీ ఇప్పటివరకు 34 సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. అలాగే సచిన్ కూడా 34 డకౌట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే 44 డకౌట్లతో జహీర్ ఖాన్ మొదటి స్థానంలో ఉండగా, ఇషాంత్ శర్మ 40, హర్భజన్ సింగ్ 37, అనిల్ కుంబ్లే 35 డకౌట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ సచిన్ తర్వాత ఆరో స్థానంలో ఉన్నారు.

Advertisement
Next Story

Most Viewed