చిన్నస్వామి స్టేడియం ఘటన.. ఈ బాధ వర్ణనాతీతమంటూ కొహ్లీ ఎమోషనల్

by Naga Rani Yarlagadda |

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడంపై ఆర్సీబీ ప్లేయర్ కింగ్ కొహ్లీ (Virat Kohli) ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు.

చిన్నస్వామి స్టేడియం ఘటన.. ఈ బాధ వర్ణనాతీతమంటూ కొహ్లీ ఎమోషనల్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించడంపై ఆర్సీబీ ప్లేయర్ కింగ్ కొహ్లీ (Virat Kohli) ఇన్ స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీ చేసిన ప్రకటను పోస్ట్ చేస్తూ.. ఈ ఘటనపై మాటలు రావడం లేదని, ఈ బాధ వర్ణనాతీతం అని క్యాప్షన్ ఇచ్చి.. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు.

అంతకుముందు ఆర్సీబీ ఈ ఘటనపై విడుదల చేసిన కీలక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇది అత్యంత దారుణమైన ఘటన అని, ఆర్సీబీ విజయోత్సవం నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం తమను తీవ్రంగా కలచివేశాని పేర్కొంది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ (IPL) ఛైర్మన్ అరణ్ ధుమాల్.. ఈ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరు నిర్వహించారన్న ఆయన.. బీసీసీఐ, ఐపీఎల్ యాజమాన్యానికి దీనిపై కనీస సమాచారం కూడా తెలియదన్నారు. తమవరకూ జూన 3నే సెలబ్రేషన్స్ ముగిశాయన్నారు. కాగా.. ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు సంయుక్తంగా ప్రకటించాయి.

Next Story