కింగ్ అంటే అతను.. బాబర్ అద్దంలో చూసుకోవాలి : పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు

by Harish |

పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు.

కింగ్ అంటే అతను.. బాబర్ అద్దంలో చూసుకోవాలి : పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. తాజాగా ఓ పాక్ మీడియా ఇంటర్యూలో పాల్గొన్న అతను.. బాబర్ పీఆర్ టీమ్‌పై మండిపడ్డాడు. సోషల్ మీడియాలో ఓవర్ హైప్ ఇస్తున్నారని చెప్పాడు. కింగ్ అని పిలవబడే అర్హత ఎవరైనా ఉందా అంటే అది విరాట్ కోహ్లీకి మాత్రమేనని, బాబర్ కాదన్నాడు. పీఆర్ టీమ్ వల్ల కింగ్ కాలేరని, ఓ సారి అద్దం చూసుకోవాలని ఘాటుగా విమర్శించాడు. అలాగే, కోహ్లీపై హఫీజ్ ప్రశంసలు కురిపించాడు. ‘విరాట్ బిగ్ స్టేజ్ ప్లేయర్. పెద్ద సందర్భాల కోసం అతను ఎదురుచూస్తాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు సత్తాచాటుతాడు. ‘భారత్ కోసం మ్యాచ్ గెలుస్తాను. నేను ఆడటమే కాదు నా దేశం కోసం మ్యాచ్ గెలుస్తాను’ అని కోహ్లీ అనుకుంటాడు. అందుకే అతను ప్రపంచంలోనే గ్రేటెస్ట్ బ్యాటర్.’ అని ప్రశంసించాడు.


Next Story