- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆసిస్‌తో ఐదో టెస్టులో గంభీర్ అతనికి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాడా?.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి..

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ చేయమని హెడ్ కోచ్ గంభీర్ అడిగాడట. కానీ, అందుకు విరాట్ నిరాకరించినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఐదో టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్ ఓ మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. పేలవ ఫామ్ నేపథ్యంలోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు హిట్‌మ్యాన్ చెప్పాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 రన్సే చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా జట్టును నడిపించాడు. అయితే, ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాలని గంభీర్ ఆశించాడని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. కానీ, కోహ్లీ మరోసారి కెప్టెన్సీ రోల్ చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని, అందుకే గంభీర్ రిక్వెస్ట్‌ను నిరాకరించాడని పేర్కొంది. ఇటీవల రంజీ ట్రోఫీలోనూ ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడానికి కోహ్లీ ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి.
- Tags
- #Virat Kohli