- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెస్టుల్లోకి రీ-ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చేసిన విరాట్ కోహ్లీ
టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో చాలా రకా

దిశ, వెబ్ డెస్క్: టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత, టెస్టుల్లో భారత జట్టు అత్యంత దారుణ ప్రదర్శన కనబరుస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ పదవిని తొలగించి, టెస్ట్ క్రికెట్ లోకి ( Test Retirement) విరాట్ కోహ్లీని తీసుకురావాలని ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టెస్ట్ కెప్టెన్సీ కూడా విరాట్ కోహ్లీకి ఇవ్వాలంటున్నారు.
ఆ దిశగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI) కూడా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు భారత అభిమానులు. అయితే దీనిపై తాజాగా స్వయంగా విరాట్ కోహ్లీ స్పందించారు. దక్షిణాఫ్రికాపై ( south Africa) జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విజయం తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా విరాట్ కోహ్లీని పలు రకాల ప్రశ్నలు అడిగారు కామెంటేటర్ హర్ష భోగ్లే (Harsha Bhogle). ఇందులో భాగంగానే టెస్టుల్లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నావా ? అంటూ విరాట్ కోహ్లీని ప్రశ్నించాడు.
అయితే దీనిపై స్వయంగా విరాట్ కోహ్లీ స్పందిస్తూ తాను రావడం లేదన్నారు. మూడు ఫార్మట్స్ లో ఆడటం తనకు ఎంతో ఇష్టం, కానీ ప్రస్తుతానికి అయితే వన్డే ఫార్మాట్ లో మాత్రమే ఆడుతా అంటూ క్లారిటీ ఇచ్చారు. రీ-ఎంట్రీ పై ఆలోచన లేదన్నారు. టెస్ట్ రిటైర్మెంట్ గురించి తాను వెనక్కి తగ్గడం లేదని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇది ఇలా ఉండగా, దక్షిణాఫ్రికాపై జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) అద్భుతంగా రాణించాడు. తొలి వన్డే మ్యాచ్ లో సెంచరీతో దుమ్ములేపాడు. దీంతో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది భారత్.






