Virat Kohli: అయినా..! మనిషి మారలేదు.. విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ (వీడియో వైరల్)

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-31 10:32:31  IST  )

రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ (Arun Jaitley) మైదానంలో ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ ఆసక్తికర కొనసాగుతోంది.

Virat Kohli: అయినా..! మనిషి మారలేదు.. విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ (వీడియో వైరల్)
X

దిశ, వెబ్‌డెస్క్: రంజీ ట్రోఫీ 2024-25లో భాగంగా అరుణ్ జైట్లీ (Arun Jaitley) మైదానంలో ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ ఆసక్తికర కొనసాగుతోంది. 241 పరుగుల వద్ద రైల్వేస్ జట్టు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ఉపేంద్ర యాదవ్ 95 పరుగులు, కరణ్ శర్మ 50 పరుగులు చేశారు. ఇక ఢిల్లీ బౌలర్లలో నవదీప్ సైనీ 3, సుమిత్ మథుర్ 3, సిద్ధాంత్ శర్మ 2, మనీ గ్రేవల్ 2 వికెట్లను పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్లు అర్పిత్ రాణా (10), సనత్ సంగ్వాన్ (30) తక్కువ స్కోర్‌‌కే అవుట్ అయ్యారు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చి యష్ ధూల్ (32) పరుగులు చేసి పెవీలియన్‌కు చేరాడు.

మరోసారి విరాట్ విఫలం

ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy)లో ఘోర పరాజయం తరువాత టీమిండియా ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్‌ ఆడాలని బీసీసీఐ (BCCI) ఆల్టిమేటం జారీ చేయడంతో అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు రంజీ ట్రోఫీ (Ranji Trophy) ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు 12 ఏళ్ల రంజీల్లో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ (Virat Kohli) (6) మరోసారి సింగిల్‌ డిజిట్‌కే ఔటయ్యాడు. యష్ ధూల్‌ (Yash Dhul) ఔటయ్యాక సెకండ్‌ డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్‌ను ఆడటంలో విఫలమైన అతడు సంగ్వాన్ (Sangwan) బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటి వరకు విరాట్ బ్యాటింగ్‌ను చూద్దామని వచ్చిన ప్రేక్షకులు స్టేడియంలో హోరెత్తించారు. కోహ్లీ బౌల్డ్ అవ్వగానే ఒక్కసారిగా స్టేడియం సైలెంట్ అయిపోయింది. ఇక చేసేదేమి లేక అరుణ్ జైట్లీ ((Arun Jaitley)స్టేడియానికి వచ్చిన అభిమానులు ఇంటి బాట పడుతున్నారు.

Next Story