గడ్డానికి రంగు వేసే సమయం వచ్చిందంటే.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు

by Harish |

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

గడ్డానికి రంగు వేసే సమయం వచ్చిందంటే.. కోహ్లీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సోర్ట్స్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్టులకు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్టు రిటైర్మెంట్‌‌‌పై కోహ్లీ ఓ పబ్లిక్ ఈవెంట్‌లో స్పందించాడు. లండన్‌లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన ఫౌండేషన్ యూవీకెన్ కోసం నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి కోహ్లీ, సచిన్ టెండూల్కర్, కెవిన్ పీటర్సన్, బ్రియాన్ లారా, ఆశిష్ నెహ్రా క్రిస్ గేల్, రవిశాస్త్రి‌లతోపాటు భారత జట్టు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా హోస్ట్ గౌరవ్ కపూర్.. కోహ్లీని టెస్టు రిటైర్మెంట్ గురించి స్పందించాల్సిందిగా కోరాడు. దీనికి విరాట్ బదులిస్తూ..‘రెండు రోజుల క్రితం నా గడ్డానికి కలర్ వేసుకున్నా. ప్రతి నాలుగు రోజులకోసారి మీ గడ్డానికి రంగు వేసుకునే సమయం వచ్చిందని మీకు తెలుసు.’అని వ్యాఖ్యానించాడు. టెస్టులకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందని పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. అలాగే, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లతో డ్రెస్సింగ్ రూం పంచుకున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. ‘స్టేడియం లోపల, బయట మా మధ్య మంచి బంధం ఉంది. నేను క్రికెటర్‌గా ఎదగడానికి వారు ఎంతో సహాయపడ్డారు. ఇవి జీవితాంతం నేను ఆదరించే బంధాలు. మేము చాలా సన్నిహితంగా ఉన్నా యువరాజ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని మాకు తెలియదు. క్యాన్సర్‌‌తో పోరాడి చాంపియన్‌గా నిలిచాడు. అతనిపై నాకు చాలా గౌరవం ఉంది. అతని కోసం ఇక్కడికి వచ్చా’అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.


Next Story