- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంగూలీ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ
అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ .

దిశ, వెబ్ డెస్క్: భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభమైన నేపథ్యంలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధిక వన్డేలు ఆడిన జాబితాలో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు 308 వన్డేలు ఆడాడు. అయితే ఆ రికార్డును తాజాగా విరాట్ కోహ్లీ దాటేశాడు. ఇవాళ న్యూజిలాండ్ తో మొదటి వన్డే మ్యాచ్ విరాట్ కోహ్లీ ఆడిన నేపథ్యంలో ఈ అరుదైన రికార్డు నెలకొల్పాడు.
తన కెరీర్ లో 309వ వన్డే ఆడి చరిత్ర సృష్టించాడు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే అత్యధిక వన్డేలు ఆడిన భారత బ్యాటర్ గా సచిన్ టెండుల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఇప్పటివరకు 463 వన్డేలు ఆడాడు. అతని తర్వాత 347 వన్డేలతో మహేంద్ర సింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్ 340, అజారుద్దీన్ 334 వన్డేలు ఆడి తర్వాతి స్థానాల్లో నిలిచారు. తాజాగా సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రిటైర్మెంట్ ప్రకటించకుండా వరుసగా మ్యాచ్ లు ఆడినప్పటికీ, ధోని రికార్డు బ్రేక్ చేయడం కష్టమే అంటున్నారు ఫాన్స్.






