- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాక్టీస్ మొదలుపెట్టిన కోహ్లీ.. రంజీ మ్యాచ్ కోసమేనా?
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దేశవాళీలో పునరాగమనం కోసం సిద్ధమవుతున్నాడు. ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ప్రతి ఆటగాడు దేశవాళీ ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత కెప్టెన్ రోహిత్ శర్మ, గిల్, పంత్, జడేజా వంటి స్టార్లు ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో 6వ రౌండ్ మ్యాచ్‌లకు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోహ్లీ మాత్రం ఇంకా రీఎంట్రీ ఇవ్వలేదు. ఢిల్లీ తరపున సౌరాష్ట్రతో మ్యాచ్ ఆడతాడని వార్తలు వచ్చినా.. మెడనొప్పి కారణంగా ఆడలేదు. అయితే, ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు విరాట్ ఢిల్లీ జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. తాజాగా కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్ మార్గదర్శకత్వంలో విరాట్ నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. కోహ్లీ దేశవాళీలో పాల్గొని దాదాపు 13 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా 2012లో ఢిల్లీకి ఆడాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న అతను ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఉన్నది. రంజీ మ్యాచ్‌లో సత్తాచాటాలనే లక్ష్యంతో కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.






