- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్ గా కోహ్లీ సరికొత్త రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( IPL ) అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). ఇవాళ

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( IPL ) అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli). ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) ఆటగాడు విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ హిస్టరీలోనే అత్యధిక బౌండరీలు ( Boundaries) కొట్టిన తొలి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు కోహ్లీ.
తన ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 1000 కి పైగా బౌండరీలు సాధించాడు. 249 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ... ఇప్పటివరకు 1001 బౌండరీలు సాధించాడు. ఇలా ఇప్పటివరకు... 1000 కి పైగా బౌండరీలు ఎవరూ కొట్టలేదు. విరాట్ కోహ్లీ వల్ల మాత్రమే సాధ్యమైంది. అలాగే విరాట్ కోహ్లీ తర్వాత శిఖర్ ధావన్ రెండవ స్థానంలో ఉన్నాడు. 221 ఇన్నింగ్స్ లలో 920 బౌండరీలు సాధించాడు శిఖర్ ధావన్.
ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 1084 ఇన్నింగ్స్ లలో 899 బౌండరీలు సాధించాడు. ఈ ముగ్గురి తర్వాత ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. 256 ఇన్నింగ్స్ లలో.. ఏకంగా 885 బౌండరీలు సాధించాడు రోహిత్ శర్మ. ప్రస్తుత రికార్డుల ప్రకారం... విరాట్ కోహ్లీని దాటాలంటే కేవలం రోహిత్ శర్మ వల్ల మాత్రమే అవుతుంది. ప్రస్తుతం శిఖర్ ధావన్ అలాగే డేవిడ్ వార్నర్ ఐపిఎల్ లో ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా వాళ్లు వాడే ఛాన్సే లేదు. కాబట్టి విరాట్ కోహ్లీని... రోహిత్ శర్మ మాత్రమే బీట్ చేయగలడు.
Virat Kohli becomes the first Batsman to Complete 1,000 Boundaries In IPL History.
— Gurlabh Singh (@gurlabhsingh610) April 10, 2025
Most Boundaries In IPL.
1001 - Virat Kohli (249 Inns)
920 - Shikhar Dhawan (221 Inns)
899 - David Warner (184 Inns)
885 - Rohit Sharma (256 Inns)#IPL2025 #ViratKohli𓃵 pic.twitter.com/GMChcHpOjo






