- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
28 వేల పరుగుల క్లబ్ లో కోహ్లీ..సచిన్ రికార్డ్ బ్రేక్ !
సచిన్ తర్వాత 28,027 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 624 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సృష్టించాడు కోహ్లీ.

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ లో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో అర్థ సెంచరీ నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.
సచిన్ టెండూల్కర్ 782 ఇన్నింగ్స్ లలో 34,357 పరుగులు సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక సచిన్ తర్వాత 28,027 పరుగులు చేసి విరాట్ కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 624 ఇన్నింగ్స్ లలో ఈ రికార్డు సృష్టించాడు కోహ్లీ. అంతేకాదు, 28 వేల పరుగులను 644 ఇన్నింగ్స్ లలో సచిన్ టెండూల్కర్ చేరుకోగా, విరాట్ కోహ్లీ మాత్రం 624 మ్యాచ్ లలో దాటాడు. అంటే సచిన్ కంటే ఫాస్ట్ 28 వేల పరుగులను దాటేశాడు. కాగా వడోదర వన్డేలో ఇప్పటికే 66కి పైగా పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. అటు మరో 140 పరుగులు సాధిస్తే, న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించనుంది.
అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్‌మెన్:
1) సచిన్ టెండూల్కర్ - 34,357
2) విరాట్ కోహ్లీ - 28,020+
3) కె సంగక్కర - 28,016
4) రికీ పాంటింగ్ - 27,483
5) ఎం జయవర్ధనే - 25,957






