T20 వరల్డ్‌కప్‌లో Virat Kohli కోహ్లీ అరుదైన రికార్డు

by Hajipasha |   (  Updated:2022-10-28 02:35:53  IST  )

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.Latest Telugu News

T20 వరల్డ్‌కప్‌లో  Virat Kohli  కోహ్లీ అరుదైన రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్:టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అద్భుత ఫామ్‌లోకి దూసుకొచ్చిన విరాట్.. టీ20 ప్రపంచకప్‌లో వరుస అర్ధశతకాలతో ఆకట్టుకుంటున్నాడు. అయితే వరల్డ్‌కప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 62 పరుగులు చేసిన కోహ్లీ.. 989 పరుగులు పూర్తి చేరుకున్నాడు. దాంతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ప్లేయర్‌గా ఘనత సాధించాడు. అలాగే ఈ జాబితాలో అత్యధిక పరుగులు చేసి రెండో ప్లేయర్‌గా ఉన్న క్రిస్ గేల్ పరుగులను అధిగమించాడు. గేల్ వరల్డ్‌కప్‌లో 965 పరుగులు చేయగా.. కోహ్లీ తాజాగా 989 పరుగులతో తన రికార్డు కూడా బ్రేక్ చేశాడు. ఇక, ఓవరాల్‌గా వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా మహేలా జయవర్ధనే 1016 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.

Next Story