Virat Kohli: విరాట్ శ‌ర్మ షాకింగ్ లుక్‌.. వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-01-08 14:06:07  IST  )

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ షాకింగ్ లుక్ లో కనిపించారు. నిన్న వడోదరకు చేరుకున్న విరాట్ కోహ్లీ, ఇవాళ నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు.

Virat Kohli: విరాట్ శ‌ర్మ షాకింగ్ లుక్‌.. వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ షాకింగ్ లుక్ లో కనిపించారు. న్యూజిలాండ్ వర్సెస్ భారత్ మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న వడోదరకు చేరుకున్న విరాట్ కోహ్లీ, ఇవాళ నెట్స్ లో విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. ఈ సందర్భంగా షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు కోహ్లీ. షార్ట్, బనియన్ వేసుకొని.. అర్జున్ రెడ్డి తరహాలో విరాట్ కోహ్లీ కనిపించారు. ప్రాక్టీస్ సెషన్ లో విరాట్ కోహ్లీ ఇలా కనిపించినట్లు చెబుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

భారత్, న్యూజిలాండ్ సిరీస్ ఎప్పుడంటే

భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. జనవరి 11వ తేదీ నుంచి ఈ వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తొలి వన్డే వడోదర వేదికగా జరగనుంది. ఇక రెండవ వన్డే జనవరి 14వ తేదీన రాజ్ కోట్ వేదికగా జరుగుతుంది. అటు జనవరి 18వ తేదీన ఇండోర్ వేదికగా మరో వ‌న్డే నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఈ రెండు జ‌ట్ల మధ్య టి20 సిరీస్ కూడా ప్రారంభం కానుంది. అయితే ఈ మూడు వన్డేలకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండనున్నారు. క్లిక్

Next Story