- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లండన్ వీధుల్లో కోహ్లీ దంపతులు..పట్టించుకునే వాడే లేడు!
ప్రస్తుతం లండన్ లో ఉన్న కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్గా మారాయి. విరాట్ కోహ్లీ క్యాప్ పెట్టుకొని.. టీ షర్ట్ లో మెరిశారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో ఇండియా కెప్టెన్ గా ఉండి.. జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఘనత కోహ్లీ సొంతం. కెప్టెన్సీ లేకపోయినా.... వేలాది పరుగులు చేసి... టీమిండియా కు ఎన్నో విజయాలు అందించాడు కోహ్లీ. అయితే అలాంటి విరాట్ కోహ్లీ టెస్టులు అలాగే t20 లకు... గుడ్ బాయ్ చెప్పి కేవలం వన్డే లు మాత్రమే ఆడుతున్నాడు.
టీమిండియా వన్డే మ్యాచ్ లు ఆడినప్పుడు మాత్రమే ఇండియాకు వస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా లండన్ లోనే విరాట్ కోహ్లీ ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ఖరీదైన ఓ విల్లా అని కూడా కొనుగోలు చేశాడట కోహ్లీ. తన కుటుంబంతో... అక్కడే సెటిల్ అయ్యాడు. పౌరసత్వం కూడా త్వరలోనే తీసుకోబోతున్నాడట. అయితే ప్రస్తుతం లండన్ లో ఉన్న కోహ్లీ దంపతుల ఫోటోలు వైరల్ గా మారాయి.
విరాట్ కోహ్లీ క్యాప్ పెట్టుకొని.. టీ షర్ట్ లో మెరిశారు. అటు అనుష్క శర్మ కూడా క్యాప్ పెట్టుకుని.. తన కొడుకును తీసుకువెళ్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే ఇండియాలో ఇలా తిరిగితే.. సెల్ఫీల కోసం జనాలు ఎగబడేవారు. కానీ లండన్ లో మాత్రం వాళ్లను పట్టించుకునే వాడు లేడని.. ఈ ఫోటోలు చూసిన క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ప్రశాంతమైన లైఫ్ గడిపేందుకే లండన్ లో కోహ్లీ ఉంటున్నాడు అన్న సంగతి తెలిసిందే.






