Ayodhya: అయోధ్యలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. హనుమాన్ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు

by Ramesh Naini |   (  Updated:2025-05-25 07:11:05  IST  )

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ , అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది.

Ayodhya: అయోధ్యలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. హనుమాన్ గర్హి ఆలయంలో ప్రత్యేక పూజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అతని సతీమణి బాలీవుడ్ నటి అనుష్క శర్మ(Anushka Sharma)లు ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల, విరాట్ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, ఆ జంట బృందావన్‌ వంటి ఆధ్యాత్మిక సందర్శనలు చేశారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న హనుమాన్ గర్హి (Hanuman Garhi temple) ఆలయాన్ని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట సందర్శించింది. ఆదివారం ఉదయం హనుమాన్ గర్హి ఆలయంలో సాంప్రదాయ దుస్తుల్లో జంట ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ జంటకు ఆలయ అర్చకులు జ్ఞాపికలను బహుకరించారు. దీనికి సంబంధించిన అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆధ్యాత్మిక చింతనతో మరోసారి నెటిజన్ల మనసులను గెలుచుకున్నారు. ఇటీవల విరాట్ కోహ్లీ జంట బృందావన్‌లోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు అయిన‌ ప్రేమానంద్ మహారాజ్‌ను దర్శించుకుని ఆశీస్సులు పొందిన విషయం విదితమే.

ఈ విరాట్ కోహ్లీ దంపతుల 2023, 2024 ఆధ్యాత్మిక సందర్శనలు చూస్తే.. గతంలో ఉత్తరాఖండ్‌లోని అనంత్ ధామ్ ఆత్మభోద్ ఆశ్రమంలోని ఆధ్యాత్మిక గురువు అనంత్ మహారాజ్‌ను కలిసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రిషికేశ్‌లోని స్వామి దయానంద్ గిరి ఆశ్రమంలో గురువు ఆశీర్వాదం తీసుకోని పూజలు చేశారు. నీమ్ కరోలీ బాబా ఆశ్రమాన్ని సందర్శించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఇక, ఈ జంట తరుచుగా మతపరమైన పండుగలను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. వినాయక చవితి, దీపావళి వంటి పండుగలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేసుకుంటారు.

Next Story