- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిన్న రిటైర్మెంట్ ప్రకటన.. ఈ రోజు నేరుగా అక్కడికి వెళ్లిన విరాట్ దంపతులు
ఐపీఎల్ 2025లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఎవరూ ఉహించని విధంగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎవరూ ఉహించని విధంగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ (Retirement from Test cricket) ప్రకటించారు. ఈ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిటైర్మెంట్ ప్రకటనకు ముందు ముంబై ఎయిర్ పోర్టు (Mumbai Airport)లో కనిపించిన విరాట్ దంపతులు.. ఈ రోజు ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో ప్రత్యక్షమయ్యారు. విరాట్ కోహ్లీ తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో స్వామి ప్రేమానంద్ మహారాజ్ (Swami Premanand Maharaj) నుండి ఆశీర్వాదం పొందడానికి వెళ్లారు. ఆధ్యాత్మిక అభిరుచులకు పేరుగాంచిన ఈ సెలబ్రిటీ జంట (Celebrity couple) ముఖ్యంగా వారి జీవితంలోని ముఖ్యమైన క్షణాలలో అనేక మతపరమైన ప్రదేశాలను సందర్శించారు. ఇదే ఆశ్రమానికి వారు గతంలో కూడా వచ్చారు. కోహ్లీ తన క్రికెట్ ప్రయాణంలో ఒక పెద్ద మార్పు తర్వాత బృందావనానికి రావడం అందరినీ ఆలోచింపజేస్తుంది. కాగా ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.






