- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోహ్లీ దంపతులకు అయోధ్య ఆహ్వానం
by Harish |
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు అయోధ్య ఆహ్వానం అందింది.

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు అయోధ్య ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సెలబ్రిటీలను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కోహ్లీ దంపతులకు మంగళవారం ఆహ్వానం అందింది. ఆహ్వానాన్ని స్వయంగా అందుకోవడానికి విరాట్ ఇండోర్ నుంచి నేరుగా ముంబైకి వచ్చినట్టు జాతీయ మీడియా పేర్కొంది. ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కోహ్లీ ముంబైకి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, బుధవారం జరిగే మూడో టీ20 మ్యాచ్ కోసం అతను మంగళవారం బెంగళూరుకు వెళ్లాడు. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎం.ఎస్ ధోనీలకు అయోధ్య ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
Next Story






