- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పిరిట్ ఫోజ్ లో విరాట్ కోహ్లీ, అనుష్క !
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫోటోలను మార్ఫింగ్ చేసి, స్పిరిట్ తరహాలో పోస్టర్ క్రియేట్ చేశారు. ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారట. అర్జున్ రెడ్డి, యానిమల్ కంటే ఈ మూవీని భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసుకొస్తున్నారట. ప్రభాస్ హీరోగా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ అందాల తార తృప్తి డిమ్రి హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే కొత్త సంవత్సరం కానుకగా ఈ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ వదిలింది చిత్ర బృందం.
గాయాలతో ప్రభాస్ ఉండగా, అతనికి సిగరెట్ వెలిగిస్తూ హీరోయిన్ తృప్తి డిమ్రి మెరిశారు. ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే స్పిరిట్ పోస్టర్ ను ఇతర హీరోల అభిమానులు కూడా వాడేసుకుంటున్నారు. ప్రభాస్ స్థానంలో తమ హీరోల ఫోటోలు పెట్టి వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఫోటోలను మార్ఫింగ్ చేసి, స్పిరిట్ తరహాలో పోస్టర్ క్రియేట్ చేశారు. ఈ పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన కింగ్ కోహ్లీ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.






