- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నారు. గతేడాది తీవ్ర మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో ఆయన హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. మరోసారి కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. కాంబ్లీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారని కాంబ్లీ స్నేహితుడు మార్కస్ కౌటో తెలిపారు. తాజాగా ఓ జాతీయ మీడియాతో కౌటో మాట్లాడుతూ.. గతంలోనే కాంబ్లీ బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్టు వైద్యులు గుర్తించారని, కానీ చికిత్స ఆలస్యం కారణంగా దాన్ని తొలగించలేదని చెప్పారు. జ్ఞాపకశక్తి క్షీణించిందని, చాలా విషయాలు ఆయనకు గుర్తుకు లేవన్నారు. మద్యం తాగడం మానేశాడని, ధూమపానం ఆపకపోవడంతో అతని బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గతేడాది కాంబ్లీ హాస్పిటల్ చేరినప్పుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ సహా మాజీ క్రికెటర్లు ఆర్థికంగా అండగా నిలిచారు. ఇప్పటికీ కూడా మాజీ క్రికెటర్లు కాంబ్లీకి ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నారని కౌటో తెలిపారు. తాను కాంబ్లీ స్నేహితులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశానని చెప్పారు. కాంబ్లీ చిన్ననాటి స్నేహితుడైన సచిన్ టెండూల్కర్ అంతా తానై చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. మిగతా మాజీ క్రికెటర్ల సహకారంతో ఆర్థికంగా, వైద్యపరంగా సహాయం అందిస్తున్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. గవాస్కర్ కూడా తన ‘చాంప్స్ ఫౌండేషన్’ ద్వారా నెలకు రూ.30 వేలు కాంబ్లీకు అందిస్తున్నట్టు సమాచారం.






