- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ హజారే ట్రోఫీ.. సెమీస్‌కు పంజాబ్, విదర్భ.. పటిష్టమైన ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లకు షాక్
విజయ్ హజారే ట్రోఫీలో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్, విదర్భ జట్లు అద్భుత విజయాలు సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లాయి.

దిశ, డైనమిక్ బ్యూరో : విజయ్ హజారే ట్రోఫీలో సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో పంజాబ్, విదర్భ జట్లు అద్భుత విజయాలు సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లాయి. మధ్యప్రదేశ్‌పై పంజాబ్ రికార్డు స్థాయి విజయాన్ని నమోదు చేయగా, గత సీజన్ రన్నరప్ విదర్భ.. ఢిల్లీని ఇంటికి పంపింది.
పంజాబ్ విశ్వరూపం.. మధ్యప్రదేశ్ విలవిల
మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 345 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (88), అన్మోల్‌ప్రీత్ సింగ్ (70), నెహాల్ వధేరా (56), హర్నూర్ సింగ్ (51) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం 346 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. పంజాబ్ బౌలర్ల ధాటికి 31.2 ఓవర్లలోనే 162 పరుగులకు కుప్పకూలింది. రజత్ పటీదార్ (38) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్ సాన్విర్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్, క్రిష్ భగత్, రమణ్‌దీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీశారు. దీంతో పంజాబ్ 183 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఢిల్లీ ఆశలపై నీళ్లు చల్లిన విదర్భ..
మరో క్వార్టర్ ఫైనల్లో ఇషాంత్ శర్మ నేతృత్వంలోని ఢిల్లీ జట్టుకు విదర్భ షాక్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ.. యష్ రాథోడ్ (86), అధర్వ తైడే (62) రాణించడంతో 9 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, ఆయుష్ బదోని సేవలను కోల్పోయిన ఢిల్లీ ఛేదనలో తడబడింది. అనుజ్ రావత్ (66) పోరాడినప్పటికీ, విదర్భ బౌలర్ నచికేత్ భూతే (4/51), హర్ష్ దూబే (3/36) దెబ్బకు 224 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా విదర్భ 76 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీయడం ద్వారా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ లిస్ట్-ఏ క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అధిగమించాడు.
సెమీ ఫైనల్ షెడ్యూల్
గత ఏడాది ఫైనల్‌ను తలపించేలా గురువారం జరిగే మొదటి సెమీఫైనల్లో విదర్భ vs కర్ణాటక జట్లు తలపడనున్నాయి. శుక్రవారం జరిగే రెండో సెమీస్‌లో సౌరాష్ట్ర vs పంజాబ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.






