- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ హజారే ట్రోఫీ కర్ణాటక కైవసం.. ఫైనల్‌లో విదర్భపై విజయం
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కర్ణాటక కైవసమైంది.

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ కర్ణాటక కైవసమైంది. శనివారం వడోదరా వేదికగా జరిగిన ఫైనల్‌లో విదర్భను 36 పరుగుల తేడాతో ఓడించింది. విజయ హజారే ట్రోఫీ విజేతగా నిలవడం కర్ణాటకకు ఇది ఐదోసారి. దీంతో టోర్నీ చరిత్రలో తమిళనాడుతో సంయుక్తంగా అత్యధికసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలిచింది. మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 348 రన్స్ చేసింది. రవిచంద్రన్(101) శతకంతో రెచ్చిపోయాడు. అతనికితోడు అభినవ్ మనోహర్(79) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. క్రిష్ణన్ శ్రీజిత్(78) కూడా రాణించాడు. అనంతరం ఛేదనలో పోరాడిన విదర్భ 48.2 ఓవర్లలో 312 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే(110) సెంచరీతో రాణించగా.. హర్ష్ దూబె(63) మెరుపు పోరాటం చేశాడు. అయితే, కర్ణాటక బౌలర్ల ధాటికి వికెట్లు కోల్పోవడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. కర్ణాటక బౌలర్లలో వాసుకి కౌశిక్, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు. రవిచంద్రన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన విదర్భ కెప్టెన్ కరుణ్ నాయర్(779) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.






