- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ హజారే ట్రోఫీ షురూ: టాస్ గెలిచిన కోహ్లీసేన
దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఘనంగా ప్రారంభమైంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవాళీ వన్డే టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌ల్లో భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రాతినిధ్యం వహిస్తుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆంధ్ర జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టుకు కోహ్లీ, పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే మరోవైపు ముంబై, సిక్కిం జట్ల మధ్య జరుగుతున్న పోరులో సిక్కిం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో ముంబై జట్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్టార్ ప్లేయర్ల రాకతో విజయ్ హజారే ట్రోఫీకి కొత్త కళ వచ్చింది. దీంతో వారిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున గ్రౌండ్ కు రావడంతో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులు కోలాహలంగా మారిపోయాయి.






