- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్సీబీ కెప్టెన్ జట్టు ఘోర పరాజయం.. ఇరానీ కప్ విదర్భ కైవసం
రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న విదర్భ జట్టు ఇరానీ కప్ ట్రోఫీని కూడా ఎగరేసుకపోయింది.

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ కైవసం చేసుకున్న విదర్భ జట్టు ఇరానీ కప్ ట్రోఫీని కూడా ఎగరేసుకపోయింది. ఆదివారం ముగిసిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాపై 93 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 342 రన్స్ చేయగా.. రెస్ట్ ఆఫ్ ఇండియా 214 స్కోరు చేసింది. దీంతో 128 పరుగుల లీడ్ సాధించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 232 పరుగులు చేసి మొత్తం 361 పరుగుల లక్ష్యం నిర్దేశించింది.
ఆదివారం లక్ష్య ఛేదనను కొనసాగించిన రెస్ట్ హాఫ్ ఇండియా 267 స్కోరుకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 30/2తో ఆ జట్టు ఆట కొనసాగించగా..కెప్టెన్ రజత్ పటిదార్(10), రుతురాజ్ గైక్వాడ్(7), ఇషాన్ కిషన్(35) ఆకట్టుకోలేకపోయారు. యశ్ ధుల్(92), మానవ్ సుథార్(56 నాటౌట్) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. విదర్భ బౌలర్ హర్ష్ దూబె 4 వికెట్లతో విజృంభించి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆదిత్య, యశ్ ఠాకూర్ చెరో 2 వికెట్లతో రాణించారు. విదర్భ ఇరానీ కప్ గెలవడం ఇది మూడోసారి. ఇంతకు ముందు వరుసగా 2017-18, 2018-19 సీజన్లలో విజేతగా నిలిచింది.






