- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విక్కీ ‘పసిడి’ పట్టు.. ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం
భారత యువ రెజ్లర్ విక్కీ సత్తాచాటాడు. అండర్-23 విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత యువ రెజ్లర్ విక్కీ సత్తాచాటాడు. అండర్-23 విభాగంలో ఆసియా చాంపియన్‌గా అవతరించాడు. వియత్నంలో జరుగుతున్న అండర్-23 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫ్రీస్టైల్ 97 కేజీల కేటగిరీలో స్వర్ణం దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో కజకస్థాన్‌కు చెందిన నుర్‌డౌలెట్ బెకెనోవ్‌ను మట్టికరిపించాడు. టోర్నీలో భారత్‌కు ఇది 6వ గోల్డ్ మెడల్.
మరోవైపు, యువ మహిళా రెజ్లర్ల పతకాల పంట కొనసాగుతోంది. గురువారం నాలుగు గోల్డ్ మెడల్స్ దక్కిన విషయం తెలిసిందే. శుక్రవారం స్వర్ణం దక్కకపోయినా పలువురు సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచారు. 57 కేజీల కేటగిరీలో నేహా శర్మ ఫైనల్‌లో 4-8తేడాతో నార్త్ కొరియాకు చెందిన జిన్ జు యాన్ చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టింది. ప్రగతి వినోద్ గైక్వాడ్(62 కేజీలు), శిక్ష(65 కేజీలు) కూడా సిల్వర్ మెడల్స్ గెలిచారు. 72 కేజీల కేటగిరీలో జ్యోతి బెర్వాల్ తృటిలో స్వర్ణాన్ని కోల్పోయింది. ఫైనల్‌లో కిర్గిజ్‌స్తాన్ రెజ్లర్ నుర్జాత్ నుర్టాఎవా చేతిలో 6-1తో పరాజయం పాలైంది. 53 కేజీల కేటగిరీలో హినాబెన్ సలీమ్‌భాయ్ ఖలీఫా మంగోలియాకు చెందిన ఓడోన్చిమెగ్‌ను ఓడించి కాంస్య పతకం దక్కించుకుంది. శుక్రవారం ఆరు పతకాలు దక్కడంతో టోర్నీలో మొత్తం భారత్ మెడల్స్ సంఖ్య 14కు చేరింది.






