సంచలన నిర్ణయం తీసుకున్న భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి

by Harish |

భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకుంది.

సంచలన నిర్ణయం తీసుకున్న భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి సంచలన నిర్ణయం తీసుకుంది. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు శుక్రవారం రిటైర్మెంట్ ప్రకటించింది. ‘పెద్ద కలలతో ఓ చిన్న టౌన్ నుంచి వచ్చిన నేను బ్యాట్ పట్టుకున్నప్పుడు ఎక్కడి వరకు వెళ్తానో తెలియదు. కానీ, ఆటను ప్రేమించడమే తెలుసు. ఇరుకైన వీధుల్లో నుంచి పెద్ద స్టేడియాలకు, భారత జెర్సీ ధరించే వరకూ తీసుకెళ్తుందని నేను ఊహించలేదు. ఈ రోజు మనస్ఫూర్తిగా నా కెరీర్‌కు ముగింపు పలుకుతున్నా. క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా. ఇప్పుడు ఆటకు నేను తిరిగిచ్చే సమయం ఇది. పాత్ర ఏదైనా, మార్గం ఏదైనా నేను ఆట కోసమే ఇక్కడ ఉన్నా. నా సెకండ్ ఇన్నింగ్స్ కూడా అర్థవంతంగా ఉంటుందని ఆశిస్తున్నా.’అని వేద సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. కాగా, 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆమె చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత ఆమె జట్టులో స్థానం కోల్పోయింది. భారత్ తరపున 47 వన్డేలు, 76 టీ20లు ఆడిన వేద 1,693 రన్స్ చేసింది.


Next Story