IND Vs SA 2nd T20 : 5 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి

by Sathputhe Rajesh |

ఇండియన్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20ల్లో తొలి సారి 5 వికెట్లు పడగొట్టాడు.

IND Vs SA 2nd T20 : 5 వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి
X

దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20ల్లో తొలి సారి 5 వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో వరుణ్ ఈ ఫీట్ సాధించాడు. తొలి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు. భారత్ 124 పరుగుల స్వల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందుంచుంది. వరుణ్ చక్రవర్తి సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఫస్ట్ ఆఫ్‌లో కీలక బ్యాట్స్ మెన్లు రీజా హెండ్రిక్స్, ఏడెన్ మార్క్ రమ్‌లను ఔట్ చేశాడు. తన స్పెల్ చివరి ఓవర్‌లో హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్‌ల వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికా జట్టును ఇబ్బంది పెట్టాడు. రెండో టీ20లో గెలవడం ద్వారా టోర్నీలో సౌతాఫ్రికా మళ్లీ రేసులోకి వచ్చింది. రెండు జట్లు తలో మ్యాచ్ గెలిచి 1-1తో సిరీస్ సమం చేశాయి. మూడో టీ20 ఈ నెల 13న సెంచూరీయన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్క్‌లో జరగనుంది.

Next Story