- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH కీలక నిర్ణయం...రంగంలోకి ఆ డేంజర్ బౌలర్ ?
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో

దిశ, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( SRH ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో దారుణంగా విఫలమైన హైదరాబాద్... 2026 టోర్నమెంట్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగానే.. టీమిండియా మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ ను (Varun Aaron) జట్టులోకి తీసుకున్నారు కావ్య పాప. బౌలింగ్ కోచ్ గా వరుణ్ ఆరోన్ ను తీసుకుంది యాజమాన్యం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే... హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ లు... ఉన్నప్పటికీ ఇప్పుడు వరుణ్ ఆరోన్ ను తీసుకుంటున్నారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వరుణ్ ఆరోన్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో.... అతన్ని బౌలింగ్ కోచ్ గా తీసుకుంది హైదరాబాద్ యాజమాన్యం. ఇండియాకు చెందిన బౌలింగ్ కోచ్ ఉండాలని... కావ్య పాప ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి హైదరాబాద్ జట్టు కోసం వరుణ్ ఆరోన్ ఏ మేరకు పని చేస్తారో చూడాలి. అతను వచ్చిన తర్వాత అయినా... హైదరాబాద్ జట్టు మెరుగుపడుతుందా లేదా చూడాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఐపిఎల్ 2025 టోర్నమెంటులో.. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తర్వాత హైదరాబాద్ జట్టు ఎలిమినేట్ అయింది.






