WPL 2026: ముంబై ఇండియ‌న్స్ లోకి కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ

by velandi.Saikiran |

క‌మిలిని స్థానంలో వైష్ణవి శర్మను జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది.

WPL 2026: ముంబై ఇండియ‌న్స్ లోకి కొత్త ప్లేయ‌ర్ ఎంట్రీ
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మహిళల ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ప్లేయర్ వచ్చేసింది. వైష్ణవి శర్మను ( Vaishnavi Sharma) జట్టులోకి తీసుకుంటున్నట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించింది. వాస్తవగా ముంబైకి చెందిన కమలిని గాయం కారణంగా టోర్నమెంటు నుంచి దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో వైష్ణవి శర్మను ఏకంగా 30 లక్షలకు కొనుగోలు చేసి తీసుకుంది ముంబై ఇండియన్స్.

ఇంతకీ ఎవరు ఈ వైష్ణవి శర్మ ?

వైష్ణవి శర్మ... ఈ మధ్యకాలంలోనే భార‌త జట్టులోకి వచ్చింది. 2025 అండర్ 19 టీ20 ప్రపంచ కప్ టోర్నమెంటులో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి చరిత్ర సృష్టించింది. మొన్న శ్రీలంక జట్టుతో జరిగిన టీ20 సిరీస్ తో అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేసింది. ఆ సిరీస్ లో ఐదు వికెట్లు పడగొట్టి సత్తా చాటింది. ఇలాంటి నేపథ్యంలోనే వైష్ణవి శర్మను ముంబై ఇండియన్స్ తీసుకుంది.

Next Story