మరోసారి వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 36 బంతుల్లోనే సెంచరీ

by Malleboina Mahesh |

విజయ్ హజారే ట్రోఫీ లో భాగంగా బీహార్ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

మరోసారి వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. 36 బంతుల్లోనే సెంచరీ
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) లో భాగంగా బీహార్ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఇది రెండో వేగవంతమైన సెంచరీగా రికార్డు సృష్టించింది. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.

ప్రస్తుతం బీహార్ జట్టు స్కోరు ఒక వికెట్ నష్టానికి 206 పరుగులు కాగా, వైభవ్ సూర్యవంశీ 156 పరుగులతో నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. అతనికి తోడుగా పీయూష్ సింగ్ 9 పరుగులతో ఆడుతున్నాడు. అంతకుముందు మంగళ్ మహ్రూర్ 33 పరుగులు చేసి నేరి బౌలింగ్‌లో అవుటయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో ఒక యువ ఆటగాడు ఇంతటి వేగంతో సెంచరీ సాధించడంతో క్రీడా ప్రపంచం ఒక్కసారిగా వైభవ్ వైపు చూస్తోంది.

Next Story