- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవ్ మరో సెంచరీ.. ఈ సారి 63 బంతుల్లోనే అరాచకం
అండర్ 19 దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్తోంది. ఈ మ్యాచ్ లోనే వైభవ్ 63 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అదే దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, 127 పరుగుల వద్ద కాసేపటి క్రితం ఔట్ అయ్యాడు. ఇందులో 10 సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: భారత కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ జెట్ స్పీడ్ తో దూసుకు వెళ్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో సెంచరీ చేయాల్సిందే అన్న కసితో ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2025 ద్వారా వెలుగులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ, ఆ తర్వాత అన్ని టోర్నమెంట్లలో సెంచరీలు చేస్తూ చరిత్ర సృష్టిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో సెంచరీ నమోదు చేశాడు వైభవ్. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 63 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.
63 బంతుల్లోనే వైభవ్ సెంచరీ
అండర్ 19 దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకు వెళ్తోంది. 26 ఓవర్లలో ఇప్పటికే 236 పరుగులు సాధించింది భారత జట్టు. ఇదే ఊపు కొనసాగితే 500 కొట్టడం గ్యారంటీ. అయితే ఈ మ్యాచ్ లోనే వైభవ్ 63 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. అదే దూకుడుగా ఆడిన వైభవ్ సూర్యవంశీ, 127 పరుగుల వద్ద కాసేపటి క్రితం ఔట్ అయ్యాడు. ఇందులో 10 సిక్సర్లతో పాటు తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. వైభవ్ సూర్య వంశీతో పాటు మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్నాడు. అతను కూడా 94 పరుగులు చేశాడు.






