Usain Bolt: క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జమైకా ఎక్స్‌ప్రెస్..

by Vinod kumar |   (  Updated:2022-09-18 11:01:01  IST  )

జమైకా ఎక్స్‌ప్రెస్ ఉసేన్ బోల్ట్ త్వరలో జరగనున్న గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్‌ లీగ్‌ - Usain Bolt Cricketing Aspiration May Come True Gets Invited To Play GPCL

Usain Bolt: క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న జమైకా ఎక్స్‌ప్రెస్..
X

దిశ, వెబ్‌డెస్క్: జమైకా ఎక్స్‌ప్రెస్ ఉసేన్ బోల్ట్ త్వరలో జరగనున్న గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్‌ లీగ్‌లో ఆడనున్నాడు. ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో 11 స్వర్ణాలు సాధించిన బోల్ట్ కొంతకాలం కిందట పరుగుకు వీడ్కోలు పలికాడు. ఇక తనకెంతో ఇష్టమైన క్రికెట్‌లో తన సత్తా చాటాలని బోల్ట్ భావిస్తున్నాడు. త్వరలో జరిగే గ్లోబల్ టీ20 పవర్ క్రికెట్ లీగ్ (జీపీసీఎల్) ద్వారా బోల్ట్ క్రికెట్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే లీగ్‌లో ఆడాల్సిందిగా టోర్నీ నిర్వాహకులు బోల్ట్‌ను ఆహ్వానించారు. బోల్ట్ క్రికెటర్ అవ్వాలన్న కల ఇప్పటిది కాదు. క్రికెటర్ అవ్వాలని బోల్ట్ చిన్నప్పటి నుంచి అనుకునేవాడు. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో, అథ్లెటిక్స్ వైపు అడుగులేశాడు. ఇన్నాళ్ళకి తన చిన్ననాటి కలను నెరవేర్చుకోబోతున్నాడు. ఈ జీపీసీఎల్ టోర్నీ ఢిల్లీలో అక్టోబర్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనుంది.

Next Story