- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Israel Strike On Iran: ఎయిర్‌పోర్టుల్లో చిక్కుకున్న భారత ప్లేయర్స్
ఇరాన్ పైఇజ్రాయెల్ దాడి జరుగుతోన్న నేపథ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పివి సింధు చిక్కుకున్నారు.

దిశ, వెబ్ న్యూస్: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం భారత్ కు కొత్త చిక్కులు తీసుకువచ్చింది. ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో విమానాశ్రయంలోనే భారత ప్లేయర్లు చిక్కుకున్నారు. ఇరాన్ దాడులు చేస్తున్న క్రమంలో పలు గల్ఫ్ దేశాల విమానాశ్రయాలలో మన భారత ఆటగాళ్లు చిక్కుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయంలో ఒలంపిక్ మెడలిస్టు, తెలుగు అమ్మాయి పీవీ సింధు కూడా చిక్కుకున్నారు. ఖతార్ లోని దోహ విమానాశ్రయంలో భారత బాస్కెట్ బాల్ జట్టు ఇరుక్కున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పీవీ సింధు ఆల్ ఇండియా టోర్నీ ఆడేందుకుగాను బర్మింగ్ హామ్ వెళ్లాల్సి ఉంది. ఈ తరుణంలోనే దుబాయ్ ఎయిర్ పోర్టులో పీవీ సింధు చిక్కుకున్నారు. అటు ఖతార్ లో 2027 వరల్డ్ కప్ కోసం ఫిబ్రవరి 27వ తేదీన క్వాలిఫైయర్స్ మ్యాచ్ ఆడింది భారత బాస్కెట్ బాల్ జట్టు. ఆ తర్వాత ఇండియాకు తిరిగి రావాల్సిన భారత బాస్కెట్ బాల్ జట్టు దోహా విమానాశ్రయంలో చిక్కుకుంది. అయితే ఈ విషయం తెలియగానే భారత విదేశాంగ శాఖ స్పందించింది. వాళ్లను సేఫ్ గా ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది భారత సర్కార్. ఈ మేరకు అన్ని చర్యలు తీసుకుంటోంది.






