WTC పాయింట్ల పట్టిక..ప్రమాదంలో టీమిండియా..ఏ స్థానంలో ఉందంటే!

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్

WTC పాయింట్ల పట్టిక..ప్రమాదంలో టీమిండియా..ఏ స్థానంలో ఉందంటే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో అర్హత సాధించాలంటే కచ్చితంగా ప్రస్తుతం జరుగుతున్న టెస్టులు గెలవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఇక్కడ గెలిచిన పాయింట్ల పట్టిక ప్రకారం.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు జట్లు వెళ్తాయి. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి.

ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్ట్ లో దారుణంగా ఓడిపోయిన టీమ్ ఇండియా.. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది. WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, ఆ తర్వాత ఇంగ్లాండు జట్లు ఉన్నాయి. ఇక శ్రీలంక మూడో స్థానానికి చేరుకోగా... బంగ్లాదేశ్ మాత్రం నాలుగో స్థానంలో ఉంది. అటు ఐదో స్థానానికి టీమిండియా దిగజారింది.

ఆ తర్వాత వెస్టిండీస్ ఆరో స్థానంలో ఉంది. ఈ లెక్కలు ఇలాగే కొనసాగితే మళ్ళీ ఆస్ట్రేలియా ఫైనల్ కు వెళ్లడం గ్యారంటీ అని చెబుతున్నారు. కాగా టీమిండియా ఒకే ఒక్క మ్యాచ్ ఆడి మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ తో వరుసగా నాలుగు టెస్టులు గెలిస్తే... టీమిండియాను ఎవరు కూడా టచ్ చేయలేరు.

Next Story