- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ మ్యాచ్ లోకి "ది అండర్టేకర్".. ?
పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ( Pakistan vs New Zealand) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... రెజ్లర్ ది అండర్టేకర్ ( The Un

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ ( Pakistan vs New Zealand) మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో... రెజ్లర్ ది అండర్టేకర్ ( The Undertaker ) ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా లైట్స్ ( Lights ) అన్ని ఆఫ్ అయ్యాయి. అదేంటి పాకిస్తాన్ మ్యాచ్ లోకి ది అండర్టేకర్ రావడమేంటి? అని అనుకుంటున్నారా? ది అండర్టేకర్ రాలేదు కానీ... అచ్చం అతడు వస్తే ఎలాగా లైట్స్ ఆగిపోతాయో...? పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో కూడా అలాగే ఓ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. తాజాగా న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మూడవ వన్డే మ్యాచ్ జరిగింది.
అయితే ఈ మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన న్యూజిలాండ్... ఏకంగా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. అవుట్ ఫీల్డ్... సరిగా లేకపోవడంతో 42 ఓవర్లకే మ్యాచ్ కుదించారు. ఈ తరుణంలోనే న్యూజిలాండ్ ఉంచిన 264 పరుగుల లక్ష్యాన్ని... ఛేదించలేక ఓటమిపాలైంది పాకిస్తాన్. అయితే.. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. ఒక్కసారిగా లైట్స్ మొత్తం ఆగిపోయాయి. న్యూజిలాండ్ ఆటగాడు డుఫ్ఫి ( Duffy) 39 ఓవర్ వేయడానికి వచ్చాడు.
ఆ సమయంలో... పాకిస్తాన్ బ్యాట్స్మెన్ తయ్యబ్ ( Tayyab) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ తరుణంలోనే.. ఒక్కసారిగా స్టేడియం మొత్తం చీకటి మాయమైంది. ఫ్లడ్ లైట్స్ తో పాటు.. స్టేడియం మొత్తం పవర్ కట్ అయింది. ఇలా దాదాపు ఐదు నిమిషాల పాటు ప్లేయర్లు అలాగే అభిమానులు చీకట్లోనే ఉండిపోయారు. సాంకేతిక సమస్యల కారణాల వల్ల.. ఈ సంఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. అయితే ఒక్కసారిగా పవర్ కట్ కావడంతో... రెజ్లర్ ది అండర్టేకర్ ఎంట్రీ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు కొంత మంది నెటిజన్స్.
Holy Sh*t ~ Where is the Undertaker 😅 #PAKvNZ pic.twitter.com/73rvcp5NzQ
— Richard Kettleborough (@RichKettle07) April 5, 2025






