నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్

by Ajay Maddhiboyina |

ఈ రోజు నుండి అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది. ఇండియా అమెరికా మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది.

నేటి నుంచి అండర్-19 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ రోజు నుండి అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ ప్రారంభం కానుంది. ఇండియా అమెరికా మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. మొత్తం 23 రోజుల పాటు టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుండ‌గా 41 మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి. నాలుగు గ్రూపుల‌తో 16 టీమ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి. సింగిల్ రౌండ్ రాబిన్ లీగ్ లో ప్ర‌తి గ్రూపులో మూడు స్థానాల్లో నిలిచే జ‌ట్టు సూప‌ర్ సిక్స్ కు అర్హ‌త సాధిస్తాయి. మ‌ళ్లీ సూప‌ర్ సిక్స్ లో 12 జ‌ట్ల‌ను 2 గ్రూపులుగా విభ‌జిస్తారు. ఈ గ్రూపులో తొలి రెండు స్థానాలు పొందే జ‌ట్లు సెమీస్ కు చేరుతాయి. ఫిబ్ర‌వ‌రి 6న ఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది.

ఇక ఈ టోర్న‌మెంట్ లో టీమ్ ఇండియా కెప్టెన్ గా ఆయుశ్ మాత్రే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతే కాకుండా ఈ టోర్నమెంట్ లో 14ఏళ్ల చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ సైతం ఆడుతున్నాడు. దీంతో వైభ‌వ్ ఆట చూసేందుకు చాలా మంది ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమ్ ఇండియా ఐదుసార్లు టైటిల్ సాధించ‌గా ఈ సారి కూడా విజ‌య‌మే ల‌క్ష్యంగా బ‌రిలోకి దూకుతోంది. చివ‌ర‌గా 2024లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి భార‌త్ ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.

Next Story