- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీఆర్ఎస్‌లో అంపైర్స్ కాల్ ఉన్నా ఇకపై అవుటే?.. కొత్త క్రికెట్ రూల్స్!
డీఆర్ఎస్‌లో అంపైర్స్ కాల్ ఉన్నా ఇకపై అవుటేనట. క్రికెట్‌ను మరింత స్పోర్టివ్‌గా మార్చేందుకు కొత్త రూల్స్ తెస్తోంది ఐసీసీ.

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌ను మరింత స్పోర్టివ్‌గా మార్చేందుకు ఐసీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇటీవలే ‘బన్నీ హాప్’ క్యాచులను నిషేధించాలని నిర్ణయించిన ఐసీసీ.. ఇప్పటికే టెస్టు క్రికెట్లో కూడా స్టాప్ క్లాక్‌ను అమలు చేస్తోంది. తాజాగా మరికొన్ని కొత్త రూల్స్‌ను కూడా తీసుకురావాలని ఐసీసీ డిసైడ్ అయినట్లు సమాచారం. వీటిలో ప్రధానమైన మార్పులేంటో చూద్దామా..?
స్టాప్ క్లాక్
వైట్ బాల్ క్రికెట్లో విజయవంతంగా అమలు చేస్తున్న స్టాప్ క్లాక్‌ను టెస్టు క్రికెట్లో కూడా అమలు చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ రూల్ ప్రకారం, ఓవర్ ముగిసిన తర్వాత బౌలింగ్ టీం 60 సెకన్లలో మరో ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉండాలి. అలా కానీ పక్షంలో అంపైర్ వార్నింగ్ ఇస్తారు. ఇలా రెండు వార్నింగుల తర్వాత కూడా మరోసారి ఈ తప్పిదం చేస్తే.. బౌలింగ్ టీంకు ఐదు పరుగుల పెనాల్టీ వేస్తారు. 80 ఓవర్ల తర్వాత ఈ వార్నింగులు రీసెట్ అవుతాయి. అంటే ఆ తర్వాత మరో రెండు వార్నింగులు ఇచ్చే వరకు పెనాల్టీ ఉండదు.
వన్డేల్లో రెండో కొత్త బంతి
ఇప్పటి వరకు వన్డేల్లో ఒక ఇన్నింగ్సులో ఒక బంతి మాత్రమే వాడేవారు. కానీ ఇకపై 34 ఓవర్ల తర్వాత.. బౌలింగ్ టీం కొత్త బంతిని తీసుకోవచ్చు.
బన్నీహాప్ క్యాచులు
బౌండరీ వద్ద క్యాచ్ అందుకున్న ఫీల్డర్.. అదుపు తప్పి బౌండరీ దాటి వెళ్తే అక్కడ ఉండగా బంతిని కేవలం ఒకసారి మాత్రమే తాకగలడు. ఆ తర్వాత అతను మైదానంలోకి వచ్చిన తర్వాతనే బంతిని తాకాలి. ఒక వేళ మరో ఫీల్డర్ ఈ క్యాచ్ పూర్తిచేసినా ఇదే రూల్ వర్తిస్తుందని ఐసీసీ తెలిపింది.
కావాలని తీసే షార్ట్ రన్స్
ఒక్కోసారి తమకు కావలసిన బ్యాటరే స్ట్రైకర్‌గా ఉండేందుకు కొన్ని టీమ్స్.. కావాలని షార్ట్ రన్స్ తీస్తాయి. అంటే రన్ కోసం వెళ్లినప్పుడు ఒక బ్యాటర్.. కావాలని క్రీజును తాకకుండా రిటర్న్ వచ్చేస్తాడు. ఇలా కావాలని చేస్తే ఇప్పటి వరకు బ్యాటింగ్ టీంకు ఐదు పరుగుల పెనాల్టీ వేస్తున్నారు. ఇకపై స్ట్రైకింగ్‌లో ఏ బ్యాటర్ ఉండాలనే నిర్ణయం కూడా బౌలింగ్ టీం తీసుకుంటుంది.
డీఆర్ఎస్ వికెట్ జోన్
ఇకపై డీఆర్ఎస్ సమయంలో స్టంప్స్, బెయిల్స్ అవుట్ లైన్ మొత్తాన్ని వికెట్ జోన్‌గా పరిగణిస్తారు. అంటే ఎల్బీడబ్ల్యూ చెక్ చేసే సమయంలో అంపైర్స్ కాల్ ఉన్నా కూడా అవుట్ ఇస్తారు. అలాగే అంపైర్ ఒరిజినల్ డెసిషన్‌ను పరిగణనలోకి తీసుకోరని సమాచారం.
కంకషన్ నిబంధనలు
ఇకపై జట్లు ముందుగానే తమ కంకషన్ రిప్లేస్‌మెంట్ ప్లేయర్ల లిస్టును సమర్పించాల్సి ఉంటుందట. ఇంతకాలం స్వదేశంలో ఆడుతున్న జట్లు లార్జర్ పూల్ నుంచి ప్లేయర్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది. ఈ ఇంపాక్ట్ తగ్గించేందుకే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కంకషన్‌తో మ్యాచ్‌కు దూరమైన ప్లేయర్.. కనీసం వారం రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే మళ్లీ ఆడేందుకు అనుమతి ఇస్తారు. ఆటగాళ్ల భద్రత కోసం ఐసీసీ మెడికల్ అడ్వైజరీ కమిటీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
బాల్ ఛేంజ్ రూల్స్..
ప్లేయర్లు బంతిపై ఉమ్మిని వాడినట్లు తేలితే.. ఆ బంతిని మార్చడానికి వీల్లేదని కూడా ఐసీసీ నిర్ణయించిందట. కొన్ని జట్లు కావాలని ఉమ్మి వాడి బంతి షేప్ మారేలా చేస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బంతిపై ఉమ్మి వాడితే బంతి మరీ దారుణంగా చెడిపోయే వరకు అంపైర్లు దాన్ని మార్చాల్సిన అవసరం ఉండదు.
ఇవేకాక నోబాల్‌లో క్యాచులు అందుకుంటే, అది క్లీన్ క్యాచ్ అయితే బ్యాటింగ్ జట్టుకు కేవలం ఒక్క పరుగు మాత్రమే అదనంగా ఇస్తారట. ఒక వేళ అది క్లీన్ క్యాచ్ కాకపోతే బ్యాటింగ్ టీం ఎన్ని పరుగులు తీసుండేవారో అన్ని ఇచ్చేస్తారు. ఈ నిబంధనలను ముందుగా అమల్లోకి తీసుకొచ్చి, వచ్చే ఏడాది ఎంసీసీ నిబంధనల్లో చేర్చాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.






