వన్డే కెప్టెన్‌గా నా లక్ష్యం అదే : శుభ్‌మన్ గిల్

by Harish |

భారత వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించడంపై శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు.

వన్డే కెప్టెన్‌గా నా లక్ష్యం అదే : శుభ్‌మన్ గిల్
X

దిశ, స్పోర్ట్స్ : భారత వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించడంపై శుభ్‌మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశాడు. గిల్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2027‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యమని చెప్పాడు. ‘భారత్‌కు ఆడాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నా. భారత్ తరపున సుదీర్ఘ కాలం టెస్టు క్రికెట్ ఆడాలనుకున్నా. వన్డే కెప్టెన్‌గా అవకాశం రావడం గొప్ప గౌరవం. అలాగే, చాలా పెద్ద బాధ్యత అని తెలుసు. జట్టును బాగా నడిపించగలని ఆశిస్తున్నా. సౌతాఫ్రికాలో జరిగే వరల్డ్ కప్ గెలవడమే లక్ష్యం. మనం ఆ ప్రపంచకప్‌‌కు ముందు 20 వన్డేలు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం మేము ఆడుతున్నది, మేము ప్రయత్నించే ప్లేయర్.. అన్నీ వరల్డ్ కప్ గెలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని నిర్ధారించుకోవడానికే.’ అని గిల్ చెప్పుకొచ్చాడు.


Next Story