- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia cup : ఒమన్‌పై యూఏఈ విజయం.. సూపర్-4 రౌండ్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైన యూఏఈ తమ రెండో మ్యాచ్‌లో పుంజుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైన యూఏఈ తమ రెండో మ్యాచ్‌లో పుంజుకుంది. ఒమన్‌ను చిత్తు చేసింది. అబుదాబి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఒమన్‌పై 42 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుసగా రెండో ఓటమితో ఒమన్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అలాగే, టీమిండియా అధికారికంగా తర్వాతి రౌండ్ సూపర్-4కు అర్హత సాధించింది. ఒమన్‌తో మ్యాచ్‌లో యూఏఈ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఓపెనర్ అలీషాన్ షరాపు(51), కెప్టెన్ వసీమ్(69) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. అనంతరం బంతితోనూ యూఏఈ మెరిసింది. ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 18.4 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. ఒమన్ జట్టులో అర్యన్ బిస్ట్(24) టాప్ స్కోరర్. యూఏఈ బౌలర్ జునైద్ సిద్దిఖీ 4 వికెట్లతో ఒమన్ పతనాన్ని శాసించి జట్టుకు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాజా విజయంతో యూఏఈ సూపర్-4 రేసులో పాక్‌తో పోటీపడనుంది. ఈ నెల 17న పాక్, యూఏఈ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు తర్వాతి రౌండ్‌కు వెళ్తుంది.






