U19 Womens T20: భారత్‌తో సెమీస్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-31 07:02:06  IST  )

అండర్-19 మహిళల ప్రపంచకప్ రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడేందుకు సిద్ధమైంది.

U19 Womens T20: భారత్‌తో సెమీస్‌.. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్
X

దిశ, వెబ్ డెస్క్: మహిళల అండర్‌-19 T20 ప్రపంచ కప్‌(ICC Under 19 Women's T20 World Cup 2025) రెండో సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడేందుకు సిద్ధమైంది. మలేషియాలోని కౌలలంపూర్ బేయుమస్ ఓవల్ గ్రౌండ్ వేదికగా ఈ ప్రారంభమైంది. టాస్ నెగ్గిన ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌లో మరో సెమీస్‌ విజేత సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది.

ఇక వరుస విజయాలతో కొనసాగుతున్న భారత్‌ సెమీస్‌లోనూ గెలవాలని పట్టుదలతో ఉంది. ఫైనల్‌ మ్యాచ్‌ ఫిబ్రవరి 2న మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లను జియో స్టార్‌, స్టార్‌ స్పోర్ట్స్‌-2 లో వీక్షించవచ్చు.

తుది జట్లు ఇవే..

భారత్: కమలిని (వికెట్ కీపర్), గొంగడి త్రిష, సనికా చల్కే, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఐష్వరి, మిథిలా వినోద్, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నమ్ షకిల్, పరునికా సిసోదియా, వైష్ణవి శర్మ

ఇంగ్లండ్‌: డేవినా సారా పెర్రిన్, జెమీమా స్పెన్స్, ట్రుడే జాన్సన్, అబీ నారోగ్రోవ్ (కెప్టెన్), స్టబ్స్, కేటీ జోన్స్ (వికెట్ కీపర్), ప్రిషా, టిల్లే, ఫోబ్‌ బ్రెట్, ఛార్లెట్ లాంబెర్ట్, సురేంకుమా

Next Story