- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
U19 ఆసియా కప్ ఫైనల్: పాకిస్తాన్ భారీ స్కోర్.. భారత్ ముందు ఉన్న టార్గెట్ ఎంతంటే..?
అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నేడు (ఆదివారం, డిసెంబర్ 21) దుబాయ్‌లోని ఐసీసీ అకాడ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నేడు (ఆదివారం, డిసెంబర్ 21) దుబాయ్‌లోని ఐసీసీ అకాడ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచులో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోవడంతో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ బ్యాటర్ అయిన సమీర్ మిన్హాస్ 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 172 పరుగులు చేసి అవుట్ అయ్యడు. అలాగే అహ్మద్ హుస్సేన్, ఉస్మాన్ ఖాన్ 35, కెప్టెన్ హజైఫా 19 పరుగులతో రాణించారు.
అయితే చివర్లో భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో 400 వందల స్కోర్ తాకకుండా అడ్డుకున్నారు. చివరికి పాకిస్తాన్ (Pakistan) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 347 పరుగుల భారీ స్కోర్ చేశారు. భారత బౌలర్లలో హెనిల్ పటెల్ 2, ఖీలాన్ పటెల్ 2, దీపాన్ష్ దేవెంద్రన్ 3, కౌశిక్ చౌహన్ 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచులో భారత జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 348 పరుగులు చేయాల్సి ఉంది.






