- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
U19 ఆసియా కప్: సగం పాక్ ఔట్
అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : అండర్-19 ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతోంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆరోన్ జార్జ్ (85) టాప్ స్కోర్‌తో సహా కనిష్క్ చౌహాన్ (46) సహకారంతో 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. పాకిస్తాన్ బౌలర్లు అబ్దుల్ సుభాన్, మహ్మద్ సయ్యమ్ చెరో 3 వికెట్లు తీసారు. అనంతరం బరిలోకి దిగిన పాకిస్తాన్ టాప్ ఆర్డర్ వెంట వెంటనే కుప్పకూలింది. భారత ఫాస్ట్ బౌలర్ దీపేశ్ దేవంద్రన్ అద్భుత బౌలింగ్ తో సమీర్ మిన్హాస్, అలీ హసన్ బలోచ్, అహ్మద్ హుస్సేన్ ల కీలక వికెట్లు పడగొట్టాడు.
కనిష్క్ చౌహాన్ మరో వికెట్ తీయడంతో 24 ఓవర్లకు పాక్ 5 వికెట్ల నష్టానికి 77 పరుగులు మాత్రమే చేసింది. పాకిస్తాన్ విజయానికి మిగిలిన 25 ఓవర్లలో 164 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత్ గెలవాలంటే మరో 5 వికెట్లు పడగొట్టాలి. ప్రస్తుతం భారత్ పూర్తి ఆధిపత్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది.






