- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025: నేడు ఐపీఎల్ 2025లో రెండు మ్యాచ్‌లు..
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025) భాగంగా ఇవాళ రెండు మ్యాచ్ లు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ ( Kolkata Knight Riders vs Lucknow Super Giants ) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా కేకేఆర్ వర్సెస్ లక్నో జట్లు తలపడతాయి. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగాయి.
అలాగే ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు మాత్రమే జరిగాయి. ఇందులో కేకేఆర్ ( Kolkata Knight Riders ) కేవలం రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించింది. అటు లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants ) మూడు మ్యాచ్ లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇది ఇలా ఉండగా మరో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు ( Chennai Super Kings vs Punjab Kings Teams) తలపడతాయి.
ఈ మ్యాచ్ ముల్లాన్‌పూర్ వేదికగా ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇవాల్టి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. లేకపోతే... ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా తగ్గిపోతాయి. తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారిపోతాయి. కాబట్టి ఇకనుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి చెన్నై ప్లేయర్లు ఏం చేస్తారో చూడాలి.






