- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలంక క్రికెట్‌లో కలకలం.. అండర్-19 క్రికెటర్లు అరెస్ట్!
హోటల్ బాత్‌రూమ్‌లలో మహిళల న్యూడ్ వీడియోలు తీశారనే ఆరోపణలపై ఇద్దరు శ్రీలంక అండర్-19 క్రికెటర్లు అరెస్టయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక (Srilanka) క్రికెట్ జట్టులో సంచలన చోటుచేసుకుంది. ఓ హోటల్‌లోని మహిళల బాత్‌రూమ్‌లలో రహస్యంగా న్యూడ్ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలపై ఇద్దరు శ్రీలంక అండర్-19 (9Under-19) క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రీడా స్ఫూర్తిని మంటగలిపేలా సాగిన ఈ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నిందితులిద్దరూ తాము బస చేసిన హోటల్‌లో మహిళల ప్రైవసీకి భంగం కలిగిస్తూ, మొబైల్ ఫోన్ల ద్వారా బాత్‌రూమ్‌లలో దృశ్యాలను చిత్రీకరించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, ప్రాథమిక ఆధారాలను సేకరించి ఆ ఇద్దరు యువ క్రీడాకారులను కటకటాల వెనక్కి పంపారు. అయితే, ఈ ఘటనపై శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిందితులపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.






