- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : సూర్యకుమార్ కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. భారత జట్టు ఈ అపూర్వ విజయం సాధించిన నేపథ్యంలో సారథి సూర్యకుమార్ టీమిండియా ఫ్యాన్స్‌కు స్పెషల్ మెసేజ్ పంపించాడు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ శుక్రవారం సోషల్ మీడియాలో పంచుకుంది. మద్దతుగా నిలిచిన ఫ్యాన్స్‌కు సూర్య ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‘డియర్ టీమిండియా ఫ్యాన్స్.. మీ అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ మద్దతు, ఆశీస్సుల వల్లే మేం ఇక్కడ ఉన్నాం. ఈ వరల్డ్ కప్ ట్రోఫీ మొత్తం దేశానిది. ఈ విజయం మాది మాత్రమే కాదు. బ్యాటు, బంతి పట్టుకుని భవిష్యత్తు కోసం కలల కనే పిల్లలది. స్టేడియాలకు తరలివచ్చిన అభిమానులది. ఇంటి నుంచి మద్దతు ఇచ్చిన లక్షలాది మందిది. మీ ప్రార్థనలు, ప్రేమ ఈ ప్రపంచకప్ గెలవడానికి మాకు బలాన్ని ఇచ్చాయి. భారత్‌లో క్రికెట్ అంటే ఓ ఆట మాత్రమే. ఎమోషన్‌తో కూడుకున్నది. ఈ విజయం మనందరిది.’అని సూర్య తెలిపాడు. ఇక టీమిండియా నెక్స్ట్ టార్గెట్ 2028 ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించడమేనని సూర్య చెప్పాడు. అదే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌లోనూ గెలవడం లక్ష్యమన్నాడు. కపిల్ దేవ్, ఎం.ఎస్ ధోనీ, రోహిత్ శర్మ తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన భారత కెప్టెన్‌గా సూర్యకుమార్ భారత క్రికెట్‌లో నిలిచిపోనున్నాడు.
🗣️🗣️ 𝙏𝙝𝙞𝙨 𝙩𝙧𝙤𝙥𝙝𝙮 🏆 𝙞𝙨 𝙛𝙤𝙧 𝙩𝙝𝙚 𝙚𝙣𝙩𝙞𝙧𝙚 𝙘𝙤𝙪𝙣𝙩𝙧𝙮 🇮🇳
— BCCI (@BCCI) March 13, 2026
From Captain Surya Kumar Yadav ✍️
To #TeamIndia Fans 📩
🔽 Watch | #T20WorldCup | #MenInBlue | #Final | #INDvNZ | @surya_14kumar https://t.co/dX4GMhkE1i






