- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోహ్లీ తెల్ల గడ్డంపై ట్రోలింగ్...హీరో నాని 'జడల్' లుక్ తో పోల్చుతూ!
తెల్లటి గడ్డం వేసుకొని కనిపించాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ ముసలివాడు అయిపోయాడని... సోషల్ మీడియాలో తెగ కామెంట్స

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఉండరు. టెస్టులు అలాగే t20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ లండన్ లోనే ఉంటున్నాడు. కేవలం వన్డే మ్యాచులు జరిగితేనే ఇండియాకు వచ్చి.. మళ్లీ కుటుంబంతో సహా విరాట్ కోహ్లీ లండన్ వెళ్ళిపోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తన చిన్ననాటి స్నేహితుడిని కలిశాడు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటో వైరల్ గా మారింది. ఇందులో తెల్లటి గడ్డం వేసుకొని కనిపించాడు విరాట్ కోహ్లీ. దీంతో విరాట్ కోహ్లీ ముసలివాడు అయిపోయాడని... సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.
నిన్న ఉదయం నుంచి ఇదే పంచాయతీ కొనసాగుతోంది. అయితే కొంతమంది విరాట్ కోహ్లీ అంటే పడని వారు హీరో నాని ప్యారడైజ్ సినిమాతో పోల్చుతూ.. సెటైర్లు వేస్తున్నారు. సాధారణ నీళ్లు తాగితే.. హీరో నాని లాగా జడలు పెంచుకోవచ్చని అంటున్నారు. అదే ఒక లీటర్ వాటర్ కు 4000 రూపాయలు పెట్టి.. తాగితే విరాట్ కోహ్లీ లాగా తెల్ల గడ్డం వచ్చి ముసలి వాళ్లు అవుతారని సెటైర్లు పేల్చుతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను వైరల్ చేస్తున్నారు.
Instagramme Link






