- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గిల్ ఓ టెస్ట్ ప్లేయర్.. ఆసియా కప్ నుంచి తొలగించండి !
గిల్ ఓ టెస్ట్ ప్లేయర్.. ఆసియా కప్ నుంచి తొలగించండి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్ పైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ టోర్నమెంట్లో గిల్ దారుణంగా విఫలమవుతున్నాడని అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ లేదా శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకుని ఉంటే... మరిన్ని అద్భుతమైన ఫలితాలు వచ్చేవని అంచనా వేస్తున్నారు అభిమానులు. టీమిండియా వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది కాబట్టి... గిల్ ఆటతీరును ఎవరు గమనించలేకపోతున్నారని చెబుతున్నారు కొంతమంది క్రీడా విశ్లేషకులు.
కానీ ఈ టోర్నమెంట్లో మూడు మ్యాచ్ లలో కేవలం 35 పరుగులు మాత్రమే చేశాడు గిల్. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అద్భుతంగా ఆడిన గిల్ టి20 లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. అతడు టెస్టులకు అలాగే వన్డేలకు మాత్రమే సరిపోతాడని మరికొంతమంది దారుణంగా అవమానిస్తున్నారు. ఇకనైనా గిల్ తన బ్యాటుకు పని చెప్పాలని కోరుతున్నారు. లేకపోతే వైస్ కెప్టెన్సీ తో పాటు టి20 లో కూడా ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అటు ఆకాష్ చోప్రా లాంటి సీనియర్లు కూడా ఇదే విషయాన్ని.. ప్రస్తావిస్తున్నారు. గిల్ వన్ డౌన్ లో వస్తే బాగుంటుందని అంటున్నారు.






