Tri-Nation Series, 2025: ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్

by Malleboina Mahesh |

భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ట్రై నేషన్ వన్డే సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

Tri-Nation Series, 2025: ఫైనల్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోర్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా ట్రై నేషన్ వన్డే సిరీస్ (Tri-Nation ODI Series) ఫైనల్ మ్యాచ్ (final match) జరుగుతోంది. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన భారత మహిళల జట్టు మొదట ఓవర్ నుంచి శ్రీలంక (Sri Lanka) బౌలర్లపై రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా మంధాన 116 పరుగులు, ప్రతికా రావల్ 30, హర్లీన్ డియోల్ 47, హర్మన్ ప్రీత్ కౌర్ 41, జెమిమా రోడ్రిగ్స్ 44, కౌర్ 18, దీప్తి శర్మ 20 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ (India) 342 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో మల్కి మడరా, విహంగా, కుమారి 2 వికెట్లు తీసుకోగా, రణవీరా 1 వికెట్ తీసుకుంది. కాగా ఈ మ్యాచులో శ్రీలంక జట్టు విజయం సాధించాలంటే నిర్ణీత 50 ఓవర్లలో 343 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ భారీ స్కోర్ ను లంక బ్యాటర్లు చేదించి.. ట్రై నేషన్ వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంటారా.. లేక భారత్ గెలిచి కప్ కొడుతుందా తెలియాలంటే మ్యాచ్ చివరి వరకు వేచి చూడాల్సిందే.

భారత మహిళలు ప్లేయింగ్ XI: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, శ్రీ చరణి, స్నేహ రాణా, క్రాంతి గౌడ్

శ్రీలంక మహిళలు ప్లేయింగ్ XI: హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, చమరి అతపత్తు(సి), పియుమి బదల్గే, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని(w), దేవ్మీ విహంగ, సుగండిక కుమారి, మల్కి మదార, ఇనోకా రణవీర

Next Story