- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్రికెటర్ రింకు సింగ్ ఫ్యామిలీలో విషాదం.. తండ్రి ఖచంద్ర సింగ్ కన్నుమూత
భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ లివర్ క్యాన్సర్‌తో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన లివర్ క్యాన్సర్‌తో (Liver Cancer - Stage 4) బాధపడుతున్నారు. గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఖచంద్ర సింగ్ పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించగా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులో రింకూ సింగ్ సభ్యుడిగా ఉన్నారు. తండ్రి ఆరోగ్యం క్షీణించిందన్న వార్త తెలియగానే ఆయన చెన్నైలో జింబాబ్వేతో జరగాల్సిన మ్యాచ్ తర్వాత జట్టును వీడి హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. టోర్నీలో అతడు మిగిలిన మ్యాచ్‌లకు ఆయన అందుబాటులో ఉంటారా లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ తన కుమారుడిని క్రికెటర్‌గా తీర్చిదిద్దారు. తన విజయాల్లో తండ్రి ఖచంద్ర సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని చాలా ఇంటర్వ్యూలో రింకు సింగ్ ప్రస్తావించారు.






