ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి యువ ఆటగాడు దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 04:21:40  IST  )

ఆస్ట్రేలియా క్రికెట్‌ (Australia) మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి యువ ఆటగాడు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియా క్రికెట్‌ (Australia) మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌ (Melbourne)కు చెందిన 17 ఏళ్ల యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ ఇవాళ కన్నుమూశాడు. ఫెర్న్‌ట్రీ గల్లీలోని వాలీ ట్యూ రిజర్వ్‌లో ట్వంటీ-20 మ్యాచ్‌కు ముందు ఆటోమేటిక్ బౌలింగ్ మెషిన్‌తో మంగళవారం రాత్రి ప్రాక్టీస్ చేస్తుండగా బంతి నేరుగా వచ్చి మెడ భాగంలో వెనుక భాగంలో బలంగా తగిలింది. దీంతో బెన్ ఆస్టిన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

దీంతో సహచర ఆటగాళ్లు అతడిని చికిత్స నిమిత్తం మొబైల్ ఇంటెన్సివ్ కేర్ వాహనంలో క్లేటన్‌లోని మోనాష్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తరలించగా.. చిన్న మెదడకు గాయమైనట్లుగా వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందజేస్తుండగా పరిస్థితి విషమించడంతో ఇవాళ ఉదయం బెన్ ఆస్టిన్ కన్నుమూశాడు. ఈ మేరకు అతడి మరణాన్ని ఫెర్న్‌ట్రీ క్రికెట్ క్లబ్ (Ferntree Cricket Club) ధృవీకరించింది. బెన్ ఆస్టిన్ క్రికెటర్, గొప్ప నాయకుడని క్లబ్ సభ్యులు అభివర్ణించారు. క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్ (Mike Baird), బెన్ ఆస్టిన్ మరణంతో తన గుండె పగిలిందని కామెంట్ చేశారు. అనంతరం అతడి మృతి పట్ల సెయింట్ డేవిడ్స్, కిల్సిత్, మిచామ్ వంటి స్థానిక క్లబ్‌లు సంతాపం తెలిపాయి. కాగా, సరిగ్గా పదకొండేళ్ల కిందట కౌంటీ మ్యాచ్‌లో ఇదే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన స్టార్ బ్యాట్స్‌మెన్ ఫిల్‌ హ్యూస్ తలకు బంతి తగిలి మరణించిన విషయం విదితమే.

Next Story